VIDEO: పంట కాలువలకు నీటిని విడుదల చేసిన సీతక్క

MLG: గోవిందరావుపేట మండలం లక్నవరం వద్ద పంట కాలువలకు శుక్రవారం మంత్రి సీతక్క నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కొంతకాలంగా రైతులకు నాట్లు వేసుకోవడానికి నీటి కొరత ఉందని తెలుసుకుని, లక్నవరం సరస్సు తూముల మరమ్మతు పనుల అనంతరం నీటిని విడుదల చేశామన్నారు.