VIDEO: పల్నాడులో ఎమర్జెన్సీ నడుస్తోంది: మాజీ ఎమ్మెల్యే
PLD: పల్నాడులో కూటమి ప్రభుత్వం ఎమర్జెన్సీ అమలు చేస్తోందని గురువారం నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. అక్రమ కేసులతో అరెస్ట్ అవుతున్న జిల్లా అధ్యక్షుడిని పరామర్శించేందుకు వెళుతున్న వారిని అడ్డుకోవడం నియంత పోకడ అన్నారు.