గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం

సత్యసాయి: రామగిరి మండలం గరిమేకలపల్లిలో సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ముఖ్య అతిథులుగా హాజరై, ఆవిష్కరించారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్. నారాయణ చౌదరి సహకారంతో విగ్రహం ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ముందుగా గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు.