నార్మల్ డెలివరీలకు కెరాఫ్ అడ్రస్‌గా భూత్పూర్ PHC

నార్మల్ డెలివరీలకు కెరాఫ్ అడ్రస్‌గా భూత్పూర్ PHC

MBNR: భూత్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డు స్థాయిలో నార్మల్ డెలివరీ జరిగాయని డా. మహమ్మద్ అబ్దుల్ రబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా ఒక నెలలో 5 డెలివరీలు జరగాల్సి ఉంటుంది. కానీ, ఆగస్టు నెలలో 11 నార్మల్ డెలివరీ జరిగాయని అన్నారు. ఇందులో నలుగురు మగ, ఏడుగురు ఆడ పిల్లలు జన్మించి, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.