చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్
గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్దలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కార్మికుల ఇంటికి వెళ్లి మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత జరీ చీరలు ప్రఖ్యాతి చెందాయని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో నేసిన చీరలను నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు.