కంకర పోసి రోడ్డు వేయడం మరిచారు..!

కంకర పోసి రోడ్డు వేయడం మరిచారు..!

NLG: గట్టుప్పల్ మండలం అంతంపేట నుంచి రంగం తండా వరకు బీటీ రోడ్డు పనులు ఏడాది క్రితం ప్రారంభించారు. మట్టి పోసి చదును చేసి కంకర పరిచినా, బీటీ రోడ్డు వేయడం మరిచారని స్థానికులు వాపోతున్నారు. కంకరపై ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రోడ్డు వేయించాలని తండా వాసులు కోరారు.