వ్యవసాయ సొసైటీల ద్వారా పశువుల దాణా పంపిణీ
కోనసీమ: జిల్లాలో వ్యవసాయ సొసైటీల నుంచి పశువుల దాణా సరఫరా చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలు దిగబడులు పెరగడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.