బియ్యపు గింజపై వినాయకుడు రూపం

బియ్యపు గింజపై వినాయకుడు రూపం

AKP: మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నైదండ గోపాల్ వినాయక చవితి సందర్భంగా బియ్యపు గింజపై వినాయకుని ప్రతిరూపాన్ని చెక్కాడు. ఇప్పటికే మైక్రో ఆర్టిస్టు గోపాల్ పెన్సిల్ ముల్లు, సబ్బులతోను, చాక్ పీస్‌లతో వివిధ సూక్ష్మ కళాఖండాలు తయారు చేసి ఈ ప్రాంతంలో మంచి గుర్తింపు పొందారు.