మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత
KMM: కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన మిషన్ భగీరథ కార్మికుడు చందనబోయిన గాంధీ, ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో 1996 నుంచి 2006 వరకు చదువుకున్న తోటి విద్యార్థులు మిత్రుడి కుటుంబానికి రూ.50,000 రూపాయలు ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.