శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత

NZB: ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో, ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టు మూసివేసినట్లు అధికారులు తెలిపారు.