తిరుచానూరు పుష్ప యాగానికి విశాఖ నుంచి పువ్వులు

తిరుచానూరు పుష్ప యాగానికి విశాఖ నుంచి పువ్వులు

VSP: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో నిర్వహించనున్న పుష్ప యాగానికి అవసరమైన పువ్వులను విశాఖపట్నం నుంచి పంపుతున్నారు. ఈ విషయాన్ని టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరాం మంగళవారం తెలిపారు. ఎంవీపీ కాలనీలోని టీటీడీ కల్యాణ మండపంలో తన సతీమణితో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.