నూతన పాలకమండలి సభ్యుడికి ఎమ్మెల్యే ఘన సన్మానం

నూతన పాలకమండలి సభ్యుడికి ఎమ్మెల్యే ఘన సన్మానం

KKD: అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా శంఖవరం గ్రామానికి చెందిన పర్వత సురేష్ నియమితులయ్యారు. ఆయన స్వామివారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. స్వామివారికి సేవ చేసే అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి సురేష్ ధన్యవాదాలు తెలిపారు.