'మహిళా సాధికారతతోనే పూలేకు నిజమైన నివాళి'
SKLM: మహిళా సాధికారతతోనే మహాత్మా పూలేకు నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో బీసీ భవన్‌లో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం కోసం పరితపించిన పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు విద్యావంతులు కావాలని పేర్కొన్నారు.