VIDEO: 'అమ్మ బాబోయ్.. మేము పులిని చూశాం'
KKD: శంఖవరం మండలం గొంది కొత్తపల్లి గ్రామ సమీపంలో ఉన్న YRC కాలువ దగ్గరలో "పులి"ని చూశామని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులిని పట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నామని ప్రజలకు ధైర్యం చెప్పారు. ఇళ్లలో నుంచి ఎవరు అనవసరంగా బయటకు రావొద్దని కోరారు.