'రహదారుల అభివృద్ది పట్ల ప్రత్యేక శ్రద్ద'
కోనసీమ: గ్రామాలలో రహదారుల అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న రహదారి మరమత్తు పనులను ప్రారంభించారు. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధితో పాటు అవసరమైన రహదారులకు మరమ్మత్తులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.