విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

VZM: జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరంలోని బాబామెట్ట గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు, వ్యాసరచన పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించడమే లక్ష్యమని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ తెలిపారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.