వేములలో 'రైతన్న మీ కోసం' కార్యక్రమం
KDP: వేముల మండల కేంద్రంలో ఇవాళ 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారి ఓబులేసు, స్పెషల్ ఆఫీసర్ రామ్ దీక్షితో కలిసి నిర్వహించారు. ఏవో ఓబులేసు మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని, విత్తనాల ఎంపిక నుంచి కోత వరకు ప్రతి దశలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.