రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

అన్నమయ్య: కోడూరు మండలం గుండాలేరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరు నుంచి రాజంపేటకు వెళ్తున్న ఆటోను కడప నుంచి తిరుపతికి వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.