పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం

పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం

AKP: మునగపాక మండలం వెంకటాపురం నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పలువురు ఆలయానికి విచ్చేసి పరమేశ్వరుని దర్శించుకుని అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే సందరపు విజయ్ కుమార్ స్వామికి పంచామృత అభిషేకం చేశారు.