TTD జూనియర్ కళాశాల హాస్టల్ ఆకస్మిక తనిఖీ

TTD జూనియర్ కళాశాల హాస్టల్ ఆకస్మిక తనిఖీ

TPT: టీటీడీ జూనియర్ కళాశాలలోని శాంభవి హాస్టల్ బ్లాక్‌ను బుధవారం టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. హాస్టల్ పరిసరాల్లో శుభ్రత, భోజన నాణ్యత, తాగునీరు, విద్యుత్, విద్యా వాతావరణం వంటి అంశాలపై సమీక్షించారు. కళాశాలలో పలు సమస్యలను గుర్తించామని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.