రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికైనా సిద్ధం: ఎంప్లాయిస్ యూనియన్
NLR: ఆర్టీసీ విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య హెచ్చరించారు. నెల్లూరు రోటరీ ఆడిటోరియంలో జరిగిన జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు.