VIDEO: 'నీటి సంరక్షణతోనే ఎద్దడి నివారణ'

VIDEO: 'నీటి సంరక్షణతోనే ఎద్దడి నివారణ'

HNK: ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించి నీటి ఎద్దడిని నివారించుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ జల, అటవీ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఆత్మకూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డితో కలిసి నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. మనిషి మనుగడకు నీటితో పాటు ఆక్సిజన్ కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. అడవులను సంరక్షించడం ద్వారా వర్షపాతం పెరుగుతుందన్నారు.