రోడ్డు పక్కన చెత్త కుప్పలు... మేం ఎలా ముందుకెళ్లాలి..!

రోడ్డు పక్కన చెత్త కుప్పలు... మేం ఎలా ముందుకెళ్లాలి..!

GDWL: కేటీదొడ్డి మండలం కొండాపూర్ గ్రామం పరిసర ప్రాంతాలలో చెత్తనంతా రోడ్డు పక్కనే పడేయడం వల్ల గ్రామంలోకి వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​గ్రామ సచివాలయం అధికారులు వెంటనే స్పందించి, చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించాలని కోరారు. రోడ్డును కూడా వెంటనే వేయించినట్లయితే తమ సమస్య పరిష్కారమవుతుందన్నారు.