జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు

SRD: సంగారెడ్డి లోని శ్రీ రామ మందిరం వద్ద మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం రాత్రి నిర్వహించారు. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని జరిపించారు. జగ్గారెడ్డి స్వయంగా ఉట్టి తాడును లాగారు. అంతకుముందు శ్రీరామ మందిరంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.