విశాఖలో సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి
VSP: సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ 3వ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ విశాఖ సిటీ వైడ్ కృష్ణ-మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కృష్ణ గారి కళా సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని అభిమానులు పేర్కొన్నారు.