యువతితో అసభ్య ప్రవర్తన.. యువకులు అరెస్ట్

యువతితో అసభ్య ప్రవర్తన.. యువకులు అరెస్ట్

TG: యువతిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెక్సా షోరూం ముందు స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అయితే ఆ సమయంలో కారులో వెళ్తున్న వారు తీసిన వీడియో వైరల్ అవ్వడంతో, 24 గంటల్లోనే ఆ యువకులను కనిపెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు.