కోటవురట్ల ఎస్సైగా విజయ్ కుమార్
AKP: కోటవురట్ల పోలీస్ స్టేషన్‌కి ఎస్సైగా ఏ.విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. తాను వైజాగ్ టౌన్ పెందుర్తి, ఆరిలోవ పిఎస్‌లో ఉద్యోగ నిర్వహణ చేసి ఇక్కడికి బదిలీపై వచ్చానని తెలిపారు. ప్రజల సంరక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ఎస్సైగా పని చేసిన రమేష్‌కు ఎస్ రాయవరం మండలానికి బదిలీ అయ్యారు.