పనుల కోసం గుంతలు తీశారు.. పూడ్చడం మరిచారు
VSP: జీవీఎంసీ 24 వార్డు గాంధీనగర్ అమృత్ 2.0 మంచినీటి పథకం కోసం భూగర్భ పైపులైన్ పనులు చేపట్టింది. ఈ నేపధ్యంలో సిబ్బంది నిర్మాణ పనుల కోసం గుంతలు తవ్వారు. నాలుగు రోజులు కిందట పనులు పూర్తి అయినా.. గుంతలు పూడ్చకుండా వదిలేశారు. దీంతో స్థానికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గుంతలు పూడ్చాలని కోరుతున్నారు.