అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర
కరీంనగర్ నుంచి ఆరంభమైన శబరిమల మహా పాదయాత్ర గురువారం కర్ణాటక రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికి 700 కిలోమీటర్లు నడకమార్గంలో పూర్తి చేసిన ఈ భక్తి యాత్ర, ఈనెల 26వ తేదీన శబరిమల చేరుకుని శ్రీ అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకోనుందని గురుస్వామి హరీశ్ గురుస్వామి తెలిపారు. మొత్తం ఈ యాత్రలో 1,450 కిలోమీటర్లు నడిచి, 4 రాష్ట్రాల మీదుగా కొనసాగుతుంది.