సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మార్కెట్ కమిటీ సభ్యులు

NZB: బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సోమవారం రోజున బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పులగుచ్చంతో సన్మానించారు. పలు అంశాల గురించి చర్చించారు. ఏఎంసీ ఛైర్మన్ సంధ్యా దామోదర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ చీల శంకర్, డైరెక్టర్‌లు గంగారం, కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి, ఏఎంసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.