VIDEO: విద్యార్థులతో వినూత్నంగా మాథ్స్ డాన్స్
AKP: గొలుగొండ మండలం పెసరాడ గ్రామం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయురాలు మౌనిక విద్యార్థులతో వినూత్నంగా మ్యాథ్స్ డాన్స్ చేయించారు. నో బ్యాగ్ డే లో భాగంగా జరిగిన కార్యక్రమంలో లెక్కలలో ఉండే ఈక్వేషన్స్‌తో చేయించిన డాన్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులను ఇది విశేషంగా ఆకట్టుకుంది. ఇలా చేస్తే పిల్లలకు వినోదం, డ్యాన్స్‌తో పాటు లెక్కలు కూడా వస్తుందని టీచర్ పేర్కొన్నారు.