మామునూరు భూ సేకరణ కొలిక్కి!

WGL: వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణలో ప్రధాన అడ్డంకిగా మారిన భూ సేకరణ ప్రక్రియ కొలిక్కి వస్తోంది. కలెక్టరు సత్యశారద నేతృత్వంలోని అధికారుల బృందం విమానాశ్రయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు, రైతులతో గత కొన్ని రోజులుగా సంప్రదింపులు జరపడంతో ఎట్టకేలకు భూములివ్వడానికి రైతులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.