'పిల్లల ఎదుగుదలను రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయాలి'

KMM: పిల్లల ఎదుగుదలను రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. కలెక్టరేట్లో గురువారం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీ మహిళలు, పిల్లలు హాజరు F.R.S ద్వారా 100 శాతం జరిగేలా చూడాలని, పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.