మట్టపల్లికి గవర్నర్.. ఏర్పాట్లు పూర్తి
SRPT: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి గవర్నర్ రాక సందర్భంగా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆలయ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్ది, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్, ఎస్పీలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు దేవస్థాన కమిటీ వెల్లడించింది.