ఉపాధ్యాయులు లేకుండా ప్రపంచం లేదు: MLC

ఉపాధ్యాయులు లేకుండా ప్రపంచం లేదు: MLC

GNTR: సమాజానికి దిశ, దశ చూపించే దిక్సూచి ఉపాధ్యాయులని MLC మురుగుడు హనుమంతరావు కొనియాడారు. శుక్రవారం మంగళగిరిలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు లేకుండా ప్రపంచం లేదన్నారు.