పామర్రులో పోలీసుల అవగాహన కార్యక్రమం
కృష్ణా: పామర్రు మండలం పరిధిలో జాతీయ రహదారి-65పై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న జుజ్జువరం సెంటర్ బ్లాక్‌స్పాట్ వద్ద ప్రజలు, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పామర్రు పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. విజయ భాస్కర్ పాల్గొన్నారు. హెల్మెట్ వినియోగం, వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు వంటి అంశాలపై కీలక సూచనలు చేశారు.