హిమాయత్ సాగర్లో చెత్త.. నీళ్లు తాగేది ఎలా..?

హిమాయత్ సాగర్లో చెత్త.. నీళ్లు తాగేది ఎలా..?

HYD: తాగునీటి వనరు హిమాయత్ సాగర్లో చెత్త, చెదారం పేరుకుపోతున్నాయని స్థానికులు తెలిపారు. పరిసరాల్లోని ఫంక్షన్ హాళ్లు, హోటళ్ల వ్యర్థాలు, రెడీమిక్స్ కాంక్రీట్ వాహనాల ధూళి వల్ల నీరు కలుషితమవుతోందన్నారు. 10KM పరిధిలో లేఅవుట్లు ఉండకూడదన్న నిబంధనలు అమలు కావడం లేదన్నారు. అనుమతి లేని కాంక్రీట్, క్రషర్ల ప్లాంట్లు ఉన్నా PCB పట్టించుకోవట్లేదని, దీనిపై జలమండలి స్పందించాలని కోరుతున్నారు.