శ్రీవాసవి కన్యకా పరమేశ్వరిని దర్శించుకున్న DSP

SRPT: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోదాడ DSP శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజిత రెడ్డిలు అన్నారు. బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా, కోదాడలోని కోదండ రామస్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు వారు ముఖ్య అతిథిలుగా హాజరై పూజలు నిర్వహించారు.