రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

WNP: జిల్లాలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో వనపర్తి నుంచి వెళ్లే పానగల్, కొత్తకోట, పెబ్బేరు రహదారుల విస్తరణపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న షాపింగ్, ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేసి రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.