చలి బీభత్సం.. సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

చలి బీభత్సం.. సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

ASR: అల్లూరి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకి సింగిల్ డిజిట్‌కు చేరుకుంటున్నాయి. ఇవాళ ఉదయం నమోదైన వాతావరణ గణాంకాల ప్రకారం.. అరకు లోయలో కనిష్ఠ ఉష్ణొగ్రత 8.6 C డిగ్రీలుగా నమోదు కావడం ఇదే మొదటిసారని స్థానికులు చెపుతున్నారు. అనంతగిరి, ముంచింగిపుట్టు, జి. మాడుగుల వంటి ఎత్తైన ప్రాంతాల్లో 10-15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలి మంటలపై ఆధారపడుతున్నారు.