'స్పీడ్ బ్రేకర్లు లేక ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు'
BHPL: గోరీకొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామ రామాలయం నుంచి కారుకుల ప్రకాష్ ఇంటి వరకు నూతనంగా నిర్మించిన CC రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మించి స్పీడ్ బ్రేకర్లు వేయకపోవడంతో వాహనాలు అతివేగంగా వెళ్లి అదుపు తప్పి ప్రజలను ఢీ కొడుతున్నాయి. కాంట్రాక్టర్, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఇవాళ కోరారు.