'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలి'
VZM: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కార్యకర్తలు వారధిలా పనిచేయాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్.కోట మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆమె కేడర్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.