'పంచాయితీ ఎన్నికలకు పోలీసు పకడ్బందీ ఏర్పాట్లు'
ADB: గ్రామపంచాయతీ మూడవ దశ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరుగుతున్న ఆరు మండలాల్లో జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించిన 756 వ్యక్తులు బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.