కాలువలు శుభ్రంగా ఉంచండి: మున్సిపల్ కమిషనర్

ATP: రాయదుర్గంలోని బైపాస్ రోడ్ పార్వతీనగర్ వద్ద పెద్ద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు. రానున్న 10 రోజుల్లో పట్టణంలోని ప్రధాన కాలువలు అన్నింటిలో పూడిక తీయించే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు మున్సిపల్ కమిషనర్ సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని ప్రధాన కాలువల్లో పూడిక తీయుస్తున్నామన్నారు.