రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
SDPT: జిల్లా నంగునూర్ మండలంలోని పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సిద్ధిపేట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ఇవాళ తెలిపారు. నంగునూర్,సిద్దిపేట, గట్ల మల్యాల, కొండంరాజుపల్లి, ఘన్‌పూర్, ఖాతా గ్రామంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 33 కేవీ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.