పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన రద్దు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన రద్దయింది. బాపట్ల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున హెలికాప్టర్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో చివరి నిమిషంలో పవన్ పర్యటన రద్దయినట్లు అధికారులు వెల్లడించారు.