నూతన ఎంపీడీవో బాధ్యతలు స్వీకరణ

నూతన ఎంపీడీవో బాధ్యతలు స్వీకరణ

VZM: రాజాం నూతన MPDOగా జె.ఆనందరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కోటబొమ్మాలి డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేసూ పదోన్నతిపై ఆయన రాజాం మండలానికి బదిలీపై వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారదర్శకంగా పనిచేసి, గ్రామాలలో పారిశుద్ధ్య పనులపై నిఘా ఉంచి అంటువ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు.