VIDEO: 15న జరగనున్న మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

SRCL: కేంద్రంలో ఈనెల 15న జరగనున్న భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బోయిన్పల్లి మండల కేంద్రంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి భవన నిర్మాణ కార్మికులు భారీ ఎత్తున పాల్గొని సభలను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు.