పులికాట్‌లో పూడికతీతకు రూ.100 కోట్లు మంజూరు: సోమిరెడ్డి
AP: నేలటూరులోని ఫిషింగ్ జెట్టీని త్వరలోనే పూర్తి చేస్తామని మాజీమంత్రి సోమిరెడ్డి వెల్లడించారు. పులికాట్‌లో పూడికతీతకు మరో రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 'అసంపూర్తి ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. YCP ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 18 పెట్రోలింగ్ బోట్లు మూలనపడ్డాయి. అన్ని పెట్రోలింగ్ బోట్లకూ మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తాం' అని పేర్కొన్నారు.