టీచర్ల వేధింపులు.. విద్యార్థి సూసైడ్!
ఢిల్లీలో పదో తరగతి విద్యార్థి మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి టీచర్లు, ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో రాశాడు. 'సారీ మమ్మీ.. స్కూల్లో టీచర్లు అలా ఉన్నారు. నేనేం చెప్పాలి' అంటూ తల్లికి క్షమాపణలు చెప్పాడు. తన మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.